ఆత్రేయపురం: వాడపల్లి వెంకన్నను దర్శించుకున్న హైకోర్టు జడ్జీ
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసి యున్న వెంకటేశ్వర స్వామిని హైకోర్టు జడ్జి కె.మహేశ్వరరావు ఆదివారం దర్శించుకున్నారు. స్వామి వారి ఆలయానికి విచ్చేసిన కృష్ణారావుకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు.