రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కొంతమూరు గ్రామం షణ్ముఖపీఠం నందు శ్రీ చక్ర సహిత శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి వారి కృత్తిక నక్షత్ర మాస కళ్యాణ మహోత్సవం సెప్టెంబర్ 6న బుధవారం ప్రారంభం కానుంది. ఈ కళ్యాణోత్సవంలో భక్తులకు ఎలాంటి రుసుము లేదని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చని తెలిపారు. షణ్ముఖపీఠంలో జరిగే కార్యక్రమాలు అన్నీ ఉచితంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.