ఆటోలో ప్రయాణం చేస్తుంటే నగదు చోరీ అయిన ఘటనపై రాజమండ్రి 3వ పట్టణ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. సీతానగరం మండలం మిర్తిపాడుకు చెందిన ఎం. నాగమణి ఆటో ఎక్కి రాజమండ్రి బయల్దేరింది. అయితే కాతేరు చేరుకునేసరికి చేతి సంచిలో ఉన్న రూ. 60 వేలు చోరీకి గురయ్యాయి. ఈ క్రమంలో ఆటోలో ప్రయాణించిన ఇద్దరు మహిళలపై అనుమానం ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.