రాజమండ్రి రూరల్ మండల పరిధిలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి శనివారం 8, 300 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేసినట్లు జలవనరులశాఖ అధికారులు తెలిపారు. వాటిలో తూర్పు డెల్టాలకు 1100, మధ్య డెల్టాలకు 1500, పశ్చిమ డెల్టాలకు 5700 క్యూసెక్కుల నీటిని విడుదల చేసామన్నారు. బ్యారేజీ వద్ద 10. 60 అడుగుల నీటిమట్టం కొనసాగుతుందన్నారు. అలాగే 32, 861 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేసినట్లు చెప్పారు.