మండపేటలోని వేములపల్లి శివారు జీడిమామిడి తోటలో 800 లీటర్ల బెల్లపు ఊటను పోలీసులు ధ్వంసం చేశారు. 5 లీటర్ల నాటు సారాను పోలీసులు స్వాధీనం చేసుకుని బత్తుల నాగేశ్వరరావును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు రూరల్ యస్ ఐ సురేష్ బాబు గురువారం తెలిపారు. తాపేశ్వరం లాకుల వద్ద సారా అమ్ముతున్న నూకమ్మను కూడా అరెస్ట్ చేశారు. ఈ దాడుల్లో హెడ్ కానిస్టేబుల్ నారాయణ, సత్యకుమార్ పాల్గొన్నారు.