గుంతలు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వము మిషన్ పాట్ హోల్ ఫ్రీ ఏపీని ప్రారంభించినట్లు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. పలివెల-గంటి రోడ్డు మరమ్మత్తు పనులను శనివారం ఎమ్మెల్యే సత్యానందరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే సంక్రాంతి నాటికి రాష్ట్రంలో ఎక్కడ రోడ్లపై గుంతలు ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం రూ 860 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు.