కొత్తపేట కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బాణాసంచా దుకాణాలు బోసిపోయాయి. తాత్కాలిక లైసెన్సులు తీసుకున్న దుకాణదారులు రెండు రోజుల క్రితం ప్రారంభించారు, కానీ వినియోగదారులు హోల్ సేల్ షాపుల వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రత్యేక ప్యాకేజీలు 500, 1000 రూపాయలకు అందుబాటులో ఉండటంతో చిన్న దుకాణాలకు ఆసక్తి తగ్గింది. వ్యాపారం లేకపోవడంతో వారు భారీగా నష్టపోతామని, గతంలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదని వ్యాపారులు తెలిపారు.