ఆలమూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (ఏజీపే)నియమితులైన బూసి విద్యా ప్రసన్నకు సోమవారం ఘన సత్కారం జరిగింది. స్థానిక సంగిత లక్ష్మికాంతం కళ్యాణ మండపంలో సర్పంచ్ సంగీత సుభాష్, ఎంపీటీసీ పెదిరెడ్డి పట్టాభి, ఏఎంసీ మాజీ చైర్మన్ వక్కపట్ల లక్ష్మణరావు ఆధ్వర్యంలో గ్రామస్తులు పాల్గొని గ్రామ ఆడపడుచు అయిన విద్యాప్రసన్న దంపతులకు శాలువా కప్పి ఘనంగా సత్కరించి తమఅభిమానాన్ని చాటుకున్నారు.