కడియంలో శనివారం గర్బిణి స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు, చిన్నారులకు అన్నప్రసన్న కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గోరంట్ల పాల్గొని మాట్లాడారు. గర్భిణీలు బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలని, పౌష్టికాహారం తోనే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని, రోజు తీసుకునే ఆహారంలో పౌష్టికాలు కలిగి ఉండాలని, గర్భిణీలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.