రక్తదానం శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దంపతులు

670பார்த்தது
రక్తదానం శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దంపతులు
ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం ద్వారా పునర్జన్మ నీయాలన్న సత్ సంకల్పంతో ప్రతియేటా అక్టోబర్ 3న శ్రీ రామకృష్ణ సేవా సమితి. రాంబాబు యువసేనల సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహిస్తూ వస్తున్నారు. దీనిలో భాగంగా సోమవారం స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన 12వ రక్తదాన శిబిరాన్ని రాజమండ్రి రామకృష్ణ మఠం మేనేజర్ స్వామి రఘువీరానందజీ మహరాజ్ జ్యోతి ప్రజ్వలన చేయగా, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి శ్రీమతి ఆదిలక్ష్మి దంపతులు శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా స్వామి రఘువీరానందజీ మహరాజ్ మాట్లాడుతూ రక్తదానం చేయడం పునర్జన్మ నీయడమేనని, ఈ కార్యక్రమాన్ని ప్రతియేటా నిరాటంకంగా కొనసాగిస్తున్న రాంబాబు మిత్ర బృందం అభినందనీయులన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ యువతకు రాంబాబు అందిస్తున్న సామాజిక స్ఫూర్తి ఆదర్శనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ మిషన్ సభ్యులతో పాటు పలువురు నాయకులు, యువసేన సభ్యులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி