గోపాలపురం: నల్ల బ్యాడ్జీలతో 108 సిబ్బంది నిరసన

55பார்த்தது
గోపాలపురం: నల్ల బ్యాడ్జీలతో 108 సిబ్బంది నిరసన
గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల మండలాల్లో 108, 104 కార్మికుల నిరసన దీక్ష గురువారం కొనసాగింది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ, నల్ల బ్యాడ్జీలు ధరించి 11 రోజులుగా నిరసన చేపట్టారు. వారు జీతభత్యాలు పెంచాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమను ఆదుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி