కార్మికులకు ఉచిత వైద్య శిబిరం
పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని తిరుపతి జిల్లా సత్యవేడు ఎంపీడీవో చంద్రశేఖర్ కోరారు. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా స్థానిక పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో గ్రామ సర్పంచ్ మంజుల రమేష్ అధ్యక్షతన, పంచాయతీ కార్యదర్శి మునిరవికుమార్ పర్యవేక్షణలో పారిశుద్ధ కార్మికుల కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.