తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలంలో బుధవారం రాత్రి ఓ మోస్తరు వర్షం కురిసింది. వర్షానికి వీధులు జలమయం అయ్యాయి. మండల వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. గత వారం రోజులుగా ఎండల నుంచి మండల ప్రజలకు ఉపశమనం లభించింది. మండల వ్యాప్తంగా రైతులు వరి నాట్లు నాటుకుంటున్నారు. ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.