పలమనేరు మండలం కొలమాసనపల్లి పంచాయతీలో సుమారు 5 గ్రామాలకు ఆదివారం ఉదయం నుండి ఇప్పటి మూడు గంటలవరకు కూడా కరెంటు కోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొలమాసనపల్లి విద్యుత్ శాఖ అధికారులు సమస్యను గుర్తించినప్పటికీ, ఆ విషయాన్ని పక్కన పెట్టి కరెంట్ బిల్లులు వసూలు చేస్తున్నారే తప్ప మరమ్మత్తులు చేపట్టడం లేదని, జంపర్ ను సరి చేయడానికి గంట సమయం కూడా పట్టదని 7గంటలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికి మరమ్మత్తులు చెప్పటలేదని ఆయా గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.