పలమనేరు మండలం కొలమాసనపల్లిలో హోటల్ నిర్వాహకులు జాతీయ రహదారిపైనే చెత్తకుప్పలు, హోటల్ వ్యర్థాలు, ప్లాస్టిక్ కవర్లు వేయడం వలన రోడ్డు ప్రయాణికులకు దుర్వాసనలు వెదజల్లుతున్నాయి. ఈ ప్రదేశం నివాసాల మధ్య ఉండడంతో చెత్త కుప్పలలో నిలువ ఉంటున్న దోమల వలన చుట్టుపక్కల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. సంబంధిత అధికారులు చొరవ చూపి వెంటనే రోడ్డుపై ఉన్న చెత్తకుప్పలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.