బైరెడ్డిపల్లి మండలం మిట్టపల్లి గ్రామంలో పోలీసులు ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సాంకేతిక పెరిగినప్పటి నుండి నేరాలు కూడా బాగా పెరిగాయని అమాయక ప్రజలను సైబర్ నేరగాళ్లు మీ మొబైల్ కి ఒక తెలియని లింకు పంపి దాన్ని క్లిక్ చేయగానే వాళ్ల అకౌంట్ లో నగదు ఆటోమేటిక్ గా ఖాళీ అయ్యే విధంగా మోసం చేస్తున్నారని, ఎవరు కూడా తమ బ్యాంకుకు సంబంధించిన వివరాలు కానీ ఓటిపి పాస్వర్డ్లు గాని సంబంధంలేని ఇతర వ్యక్తులకు తెలపవద్దన్నారు. గ్రామంలో కర్ణాటక మద్యం ఎవరైనా తెచ్చి అమ్మితే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అనవసర విషయాలకు వాగ్వాదాలు పెట్టుకొని ఘర్షణ వాతావరణాన్ని సృష్టించుకోకుండా అన్నదమ్ముల లాగా కలిసి ఉండాలని కోరారు. కార్యక్రమంలో బైరెడ్డిపల్లి మండల ఎస్సై వెంకట నరసింహులు, పోలీసు శాఖ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.