పిచ్చాటూరు మండలం వెంగళత్తూరు గ్రామంలో వెలసిన అతి పురాతన ఆలయం శ్రీ కామాక్షి అంబికా సమేత భిక్షాండేశ్వర స్వామి వారికి కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా శుక్రవారం సాయంత్రం స్వామివారికి అన్నాభిషేకం చేశారు. ఆలయ అర్చకులు గురు రామచంద్ర శర్మ స్వామివారికి నైవేద్యాలు సమర్పించి పంచహారతులు అందజేశారు. మహిళలందరూ ప్రమిదలలో దీపాలు, పిండి దీపాలు, 365 వత్తులతో దీపాలు వెలిగించి పూజలు చేశారు.