పూతలపట్టు మండలం పోలవరం గ్రామ సచివాలయం ముందు శనివారం ఉదయం ఒక వీధి కుక్క మరణించింది. పారిశుద్ధ్య కార్మికులకు తెలపగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. సచివాలయం సెక్రటరీ జరీనకు చెప్పగా ఆమె సచివాలయ సిబ్బందికి ఈరోజు సెలవు దినం కావడంతో పని రోజుల్లో మాత్రమే పారిశుద్ధ్య కార్మికులు వస్తారని ఈ రోజు రావడం లేదని తెలిపారు. ఉదయం 6:30 గంటల నుండి సాయంత్రం 7 వరకు అయినా కుక్క మృతదేహం తీసేవారు లేరని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసారు.