చిత్తూరు జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ వైద్య ఆరోగ్య అధికారులతో సోమవారం సాయంత్రం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈనెల14 నుంచి ఇంటి వద్దే కాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ప్రతి ఇంటి నందు 18 సంవత్సరాలు నిండిన ప్రజలందరికీ అసంక్రమణ వ్యాధులతో బిపి, షుగర్ మొదలగు వాటికి నిర్ధారణ పరీక్షలు చేయునట్లు కలెక్టర్ తెలిపారు.