చిత్తూరులోని పోలీసు కార్యాలయం లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఎస్పీ మణికంఠ ఆధ్వర్యంలో నిర్వహించారు. పలు సమస్యలపై బాధితుల నుంచి ఎస్పీ వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 37 ఫిర్యాదులు బాధితుల నుంచి అందినట్లు అధికారులు తెలిపారు. వాటిని చట్ట ప్రకారం విచారించి, పరిష్కరించేలా కృషి చేయాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు.