కుప్పం ఎరియా హాస్పిటల్ లో మంగళవారం సూపరింటెండెంట్ శ్యామల ఆధ్వర్యంలో కోర్ స్వచ్చంద సంస్థ వారి సహకారంతో మంగళవారం ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమం లో హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది, ఎలా వ్యాపించదు, హెచ్.ఐ.వి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత, చిన్న చూపు లేకుండా ఎలాగా సమాజములో కలసి జీవించాలి అని వివరించారు.