కార్వేటినగరం మండలం అల్లాగుంట పంచాయితీ, షకీలా కాలనీ, కొల్లగుంట ఎస్టి కాలనీ, కొల్లగుంట దళితవాడ, చొక్కా మడుగు పంచాయితీ, లక్ష్మీపురం పంచాయతీ గ్రామాలలో గురువారం బహుజన సమాజ్ పార్టీ కార్వేటినగరం మండల అధ్యక్షులు సెంథిల్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడపగడపకు వెళ్లి కరపత్రాల పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ సోమవారం జరిగే సార్వత్రిక ఎన్నికలలో బహుజన సమాజ్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.