AP: అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం బోరెడ్డిగారిపల్లె బస్టాప్ వద్ద కళాకారుడు దారుణహత్యకు గురయ్యాడు. ఆదివారం రాత్రి కళాకారుల మధ్య గొడవ జరిగింది. కొత్తపల్లెకు చెందిన వెంకటరమణ (35)ను తోటి కళాకారులు కొట్టి చంపారు. మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా ముళ్లపొదల్లో పడేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మరకలు గుర్తించి శవం కోసం ఆరా తీశారు. ముళ్లపొదల్లో మృతదేహాన్ని గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.