రేపల్లే: నిజాంపట్నం బీచ్ వద్ద పటిష్ట బందోబస్తు
కార్తీక పౌర్ణమి సందర్భంగా పుణ్యస్థానాలు ఆచరించడానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం సముద్ర తీరం వద్ద రేపల్లె డిఎస్పి ఆవల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శుక్రవారం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నిజాంపట్నం, పరిసవారిపాలెం బీచ్ లను సందర్శించి ప్రజలకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. సముద్ర తీరాన పోలీసు సిబ్బంది నిర్వహిస్తున్న విధులను పరిశీలించారు.