రేపల్లె పట్టణంలోని హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, కిరాణా షాపులు, షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్ లను జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి కే. దేవరాజ్ మంగళవారం తనిఖీ చేశారు. లైసెన్సు లేకుండా ఫాస్ట్ ఫుడ్ వ్యాపారం నిర్వహిస్తున్న వారిని గుర్తించి వారికి నోటీసులు జారీ చేశారు. వారం రోజులలోగా లైసెన్స్ తీసుకుని వ్యాపారం చేయాలని, లేని పక్షంలో 5 లక్షల రూపాయలు జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు.