రేపల్లెలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఐదు ఫిర్యాదులు
రేపల్లె ఆర్డీవో కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 5 ఫిర్యాదులు వచ్చినట్లు రెవెన్యూ డివిజనల్ అధికారి రామలక్ష్మి తెలిపారు. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని సంబంధిత శాఖల అధికారులకు పంపించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు ఆర్డీవో తెలిపారు.