మాచవరం వద్ద కుంగిపోయిన రైల్వే ట్రాక్.. రైళ్ల రాకపోకలకు అంతరాయం
ఎడతెరపి లేని వర్షాల కారణంగా పొన్నూరు మండల పరిధిలో సోమవారం మాచవరం వద్ద రైల్వే ట్రాక్ కుంగిపోయింది. విజయవాడ-చెన్నై మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తిరుపతి-సికింద్రాబాబ్ వందేభారత్ ఎక్స్ప్రెస్ కు అంతరాయం ఏర్పడింది. స్పందించిన అధికారులు వెంటనే రైలును వెనక్కి మళ్లించి అప్పికట్ల రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. అప్పికట్ల స్టేషన్ నుంచి మూడో లైన్ ద్వారా వందేభారత్ రైలు సికింద్రాబాద్ కు పంపించారు.