అలహాబాద్ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ అంబటి లక్ష్మణరావు గురువారం సాయంత్రం హైదరాబాద్ తన నివాసంలో అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వెల్లలూరు గ్రామం. అంతర్జాతీయ క్రికెటర్ అంబటి రాయుడుకి స్వయానా పెదనాన్న. అంబటి లక్ష్మణరావు మృతి కి పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, వైసీపీ సమన్వయకర్త అంబటి మురళి కృష్ణ, కాంగ్రెస్ నేత జక్కా రవీంద్ర సంతాపం తెలిపారు.