పెదకూరపాడు మండలం నందు 2023-24 సంవత్సరములకు సంబంధించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి 17వ విడత సోషల్ ఆడిట్ సోమవారం నిర్వహించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోషల్ ఆడిట్ టీము, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ పథకం సిబ్బంది మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తో సమీక్ష సమావేశం జరిగింది. కార్యక్రమంలో ఎంపీడీవో పి. రామకృష్ణ, ఏపీవో కోటేశ్వరరావు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.