ఒంగోలు: అధిక ధరలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలి
ప్రజలపై మోపుతున్న భారం, అధిక ధరలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సయ్యద్ హనీఫ్ పిలుపునిచ్చారు. ఒంగోలులోని సుందరయ్య భవన్ లో ఆదివారం నిర్వహించిన నగర మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై అధిక ధరలు మోపుతున్నారన్నారు. విద్యుత్తు ట్రూ అప్ చార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్ల బిగింపును విరమించుకోవాలని తెలిపారు.