పల్నాడు: వైద్యరంగానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట: చదలవాడ

84பார்த்தது
సచివాలయంలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు బుధవారం మాట్లాడారు. వైద్య రంగానికి రూ. 18వేల కోట్లు కేటాయించడం హర్షణీయమని వైద్యునిగా ఎంతో గర్వపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వైద్య రంగానికి సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. గత ప్రభుత్వంలో మరుగున పడిన అనేక వైద్య సేవలు ప్రస్తుత బడ్జెట్ తో తిరిగి పునరుద్ధరణ చేయొచ్చన్నారు.

தொடர்புடைய செய்தி