అతివేగం కారణంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని నరసరావుపేట ట్రాఫిక్ సీఐ లోకనాథం తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏ రహదారిలో ఎంత మేరకు వేగం వెళ్లాలనేది అవగాహన లేక రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని, రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారిలో అధిక శాతం యువత ఉన్నారని చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వలన డ్రైవింగ్ ఏకాగ్రత ఉండదని అన్నారు.