గుంటూరు సిద్దార్థ నగర్ లోని మాజీ మంత్రి అంబటి నివాసంలో ఉన్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త రాజశేఖర్ రెడ్డిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ వారెంట్ ఉంటే రమ్మని మీడియా ముఖంగా అంబటి నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నూజివీడు పోలీసులు రాజశేఖర్ రెడ్డిని అంబటి నివాసం నుంచి బుధవారం స్టేషన్ కు తీసుకువెళ్లారు.