ముండ్లమూరు: అతిక్రమిస్తే చర్యలు తప్పవు
ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని దర్శి సిఐ రామారావు తెలిపారు. ముండ్లమూరు మండలంలోని శంకరాపురం గ్రామంలో శనివారం దర్శి సిఐ రామారావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మాట్లాడుతూ గ్రామంలో శాంతియుత పరిరక్షణకు అందరూ సహకరించాలని కోరారు. చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు ఎవరూ పాల్పడవద్దని, అలా పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.