అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లుగా ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. ముండ్లమూరు మండలం శంకరాపురం గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న మనోజ్ అనే వ్యక్తి వద్ద ఎక్సైజ్ ఎస్సై శ్రీనివాసరావు బుధవారం రాత్రి 15 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ అక్రమంగా బెల్ట్ దుకాణాలు నిర్వహించినా, అక్రమ మద్యం అమ్మినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.