చిలకూరిపేట నియోజకవర్గంలోని నాదెండ్ల, యడ్లపాడు, చిలకలూరిపేట మండలం ఎంపీడీఓ లు, ఏ. పీ. ఓలు, టీ. ఏలతో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో పని దినాలను పెంచి, కేంద్ర నిధులను మెటీరియల్ కాంపోనెంట్ గా పెద్ద ఎత్తున సాధించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో పేదవర్గాలు అభివృద్ధి సాధించాలని సూచించారు.