బెళుగుప్ప మండలంలోని జీడిపల్లి రిజర్వాయర్ కు కృష్ణా జలాల ప్రవాహం కొనసాగుతున్నట్లు ఇరిగేషన్ అధికారులు సోమవారం విలేఖరులకు తెలిపారు. జీడిపల్లి రిజర్వాయర్ కు నీటిమట్టం 1163 క్యూసెక్కులు వస్తున్నట్లు హంద్రీనీవా అధికారులు తెలిపారు. అలాగే అవుట్ ఫ్లో కింద హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్-2కు 1, 080 క్యూసెక్కులు వెళుతున్నట్లు తెలిపారు.