కూలి పనులకు వెళ్లి ఆటోలో తిరిగి వస్తున్న ఆటో బోల్తా పడి ఇరువురు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. ఆదివారం పోలీసులు తెలిపిన వివరాల మేరకు పెద్దమండ్యం మండలం వెలిగల్లు కు చెందిన సరోజమ్మ (60), ఈశ్వరమ్మ (49) మరో ఐదుగురు కలిసి ఆటోలో తురకపల్లికి కూలి పనుల కోసం వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తుండగా హంద్రీనీవా కాలువ వద్ద ఆటో బోల్తాపడి ఇరువురికి తీవ్రంగా గాయాలయ్యాయని తెలిపారు.