చిట్వేలు: గుత్తి నరసింహకు శాశ్వత సభ్యత్వం
రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి బాధ్యులు ముక్కా రూపానందరెడ్డి ద్వారా చిట్వేలి మండలం రాజుగుంట సర్పంచ్ గుత్తి నరసింహ టిడిపిలో శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించడం జరుగుతుందన్నారు. సభ్యత్వం రుసుం రూ. 100, లైఫ్ టైం సభ్యత్వం లక్ష రూపాయలు చెల్లించాలని, ఈ మొత్తాన్ని కార్యకర్తల సంక్షేమానికి వినియోగించడం జరుగుతుందన్నారు.