రైల్వే కోడూరులో నీరు కలిపిన పెట్రోల్ బంకును సీజ్ చేయండి
రైల్వే కోడూరు లో సిద్దేశ్వర థియేటర్ ఎదురుగా ఉన్న నయారా పెట్రోల్ బంకులో నీళ్లు కలిపి మోసం చేసి పెట్రోల్ అమ్ముతున్న పెట్రోల్ బంకును సీజ్ చేసి, యాజమాన్యంపై తక్షణమే కేసులు పెట్టి లైసెన్స్ రద్దు చేయాలని అన్నమయ్య జిల్లా బికేఎంయు అధ్యక్షులు పండుగోల మణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం రైల్వే కోడూరు లో ఆయన మాట్లాడుతూ డీజిల్ పరీక్షించి నీరు ఉంది అమ్మవద్దు అని తెలిపినా ప్రజలను మోసం చేశారని అన్నారు.