బద్వేల్ ఇంటర్ విద్యార్థి విఘ్నేష్ అనే ఉన్మాది చేతిలో మరణించిన విషయం తెలిసిందే. దీంతో వారి కుటుంబానికి సీఎం రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని బుధవారం ప్రకటించడంతో పాటు వారి కుమారుడికి ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో సీటు ప్రకటించారు. వారి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే నిందుడిని కఠిన శిక్షించాలని సీఎం కోరిన విషయం తెలిసిందే.