రాష్ర్టంలో వీరశైవ లింగ బలిజలను 27% ఓబీసీలో చేర్చడానికి అసెంబ్లీలో తీర్మానం చేయాలని శుక్రవారం ఉరవకొండలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన వీరశైవ సభ్యులు మాట్లాడుతూ.. ఇప్పటికే అనంతపురం, కర్నూలు జిల్లాలో ఓబీసీ సాధన కమిటీ సభ్యులు ఎంపీ, ఎమ్మెల్యేలకు వినతిపత్రాల ద్వారా ఒత్తిడి తేవడం జరుగుతుంది అన్నారు.