నార్పల: నాసిరకం ఎరువులు అమ్మితే చర్యలు తప్పవు
నార్పల మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను తనిఖీ అధికారి ఎల్లప్ప, సహాయ వ్యవసాయ సంచాలకులు ఆధ్వర్యంలో మండల వ్యవసాయ అధికారి వీరస్వామి తనిఖీ చేశారు. తనిఖీ అధికారి, మండల వ్యవసాయ అధికారి ఎరువుల దుకాణదారులకు శుక్రవారం సూచనలను ఇచ్చారు. రైతులకు కావలసిన ఎరువులను ఎరువుల దుకాణంలో, రైతు సేవా కేంద్రాలలో అందుబాటులో ఉంచాలన్నారు. నాసిరకం ఎరువులు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు.