శింగనమల: కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి
పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించాలని సీపీఐ నేత నారాయణ స్వామి సోమవారం కోరారు. శింగనమల మండలం సలకం చెరువు గ్రామ సచివాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వాన్ని ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు చెన్నప్ప యాదవ్ తదితరులు పాల్గొన్నారు.