వ్యవసాయ బోర్లకు స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని సీపీఎం నాయకులు రామంజినేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాప్తాడు తహశీల్దార్ కార్యాలయం ముందు గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో కరువు సహాయక చర్యలు చేపట్టాలన్నారు. అధిక వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం ఇవ్వాలని, కూలీలకు ఉపాధి పనులు కల్పించాలని కోరారు.