హిందూపురం: అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తులు అరెస్ట్
పరిగి మండలం పరిధిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తులపై కేసులు నమోదు చేసి మద్యం స్వాధీనం చేసుకున్నట్లు గురువారం హిందూపురం ఎక్సైజ్ సీఐ లక్ష్మీ దుర్గయ్య తెలిపారు. గత రెండు రోజులుగా హిందూపురం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో కర్ణాటక అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్న వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు తెలిపారు.