గుత్తి: అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 63 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని వైసీపీ ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. గుత్తిలో మంగళవారం ఆయన వైసీపీ సీనియర్ నాయకులు రామ రంగారెడ్డి, గోపాల్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రతి ఎకరాకు రూ. 50 వేలు నష్టపరిహారం అందజేయాలన్నారు. ఇన్సూరెన్స్ ను ప్రభుత్వమే కట్టాలన్నారు.