విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం నవంబర్ 18న ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగే మహాధర్నా జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు కోరారు. గురువారం అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో పోస్టర్లు ఆవిష్కరించారు. పెండింగ్లో ఉన్న 3,480 కోట్ల రూపాయల విద్యా దీవెన వసతి దీవెన బకాయలు విడుదల చేయాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలల మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించాలని, సంక్షేమ హాస్టల్స్ లో 3000 రూపాయల మెస్ బిల్లు చెల్లించాలని కోరారు.