కళ్యాణదుర్గం: అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి
కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు అచ్యుత్ ప్రసాద్ బుధవారం తహశీల్దార్ భాస్కర్ కు వినతిపత్రం అందజేశారు. అచ్యుత్ ప్రసాద్ మాట్లాడుతూ కళ్యాణదుర్గం నియోజక వర్గంలో ఐదు మండలాలు ఉండగా, ఒక్క మండలాన్ని కూడా కరవు మండలంగా ప్రకటించలేదన్నారు. ఖరీఫ్ లో అతివృష్టి, అనావృష్టి వల్ల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు.