కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో 4 ఎకరాల్లో పేరుకుపోయిన దాదాపు 18 టన్నుల చెత్తాచెదారం కరిగిపోతుంది. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గెలిచిన మూడు నెలల్లోనే డంపింగ్ యార్డ్ పై దృష్టి పెట్టి అధునాతన యంత్రంతో శుభ్రం చేయిస్తున్నారు. గతంలో డంపింగ్ యార్డ్ వల్ల చుట్టుపక్కల నివాసం ఉంటున్న కుటుంబాలు, ప్రజలు దుర్వాసనతో, పొగతో నిరంతరం ఇబ్బంది పడేవారు. ఎమ్మెల్యే చొరవతో పరిశుభ్రం చేసే పనులు శరవేగంగా జరుగుతున్నాయి.